కాలేయ, ఉదర వ్యాధులు, వృద్ధాప్యం... అమితాబ్ విషయంలో వైద్యులు చెబుతున్నదిదే!
- 1982లో ఘోర ప్రమాదానికి గురైన అమితాబ్
- అప్పటి నుంచే మొదలైన కాలేయ సమస్యలు
- ప్రస్తుతానికి వెంటిలేటర్ అమర్చలేదన్న వైద్యులు
కాగా, 1982లో 'కూలీ' చిత్రం షూటింగ్ సమయంలో అమితాబ్ తీవ్ర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే ఆయనకు కాలేయ సంబంధిత సమస్యలు ప్రారంభమయ్యాయి. క్రమం తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణలో గత నాలుగు దశాబ్దాలుగా ఆయన తన రోజువారీ కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ మధ్య కాలంలో అనారోగ్యంతో పలుమార్లు చికిత్స కూడా తీసుకున్నారు. ప్రస్తుతం కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఆయన, త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నట్టు పలువురు వెల్లడించారు.