తన మేనల్లుడి సినిమా పిచ్చిని వదిలించమని అప్పట్లో కోన వెంకట్ ను కోరిన వైఎస్సార్!
- వైఎస్ కు నివాళులు అర్పించిన కోన వెంకట్
- గతంలో వైఎస్ తో అనుభవాన్ని వివరించిన సినీ రైటర్
- ఎలా స్పందించాలో అర్థంకాలేదన్న కోన
"ఈ మధ్య నీ గురించి అందరూ బాగా చెప్పుకుంటున్నారు. మంచి హిట్లు పడినట్టున్నాయి అన్నారు. దాంతో ఆయనకు థ్యాంక్స్ చెప్పాను. ఆపై ఆయన, ఓసారి మా ఇంటికి రావాలి అన్నారు. ఎందుకు సార్ అని అడిగాను. కడపలో మా మేనల్లుడు ఉన్నాడు. సినిమా థియేటర్ల బిజినెస్ లో ఉన్నాడు. ఇప్పుడు సినిమా తీయాలనుకుంటున్నాడు అని వైఎస్సార్ చెప్పారు. దాంతో ఏదైనా కథ కావాలని అడుగుతారేమో అని ఊహించాను.
కానీ వైఎస్సార్ చెప్పింది విన్న తర్వాత ఎలా స్పందించాలో తెలియలేదు. వెంకట్, మా వాడితో మాట్లాడి ఎలాగైనా సినిమా తీయాలన్న ఆలోచన మాన్పించాలని అన్నారు. అంతేకాదు, నువ్వు ఓ సినిమా తీసి ఎలా నష్టపోయావో కూడా మా వాడికి వివరించు అని చెప్పారు" అంటూ నాటి విషయాలను కోన వెంకట్ వెల్లడించారు.