పల్టీలు కొట్టిన ఏపీ మంత్రి బాలినేని ఎస్కార్ట్ వాహనం.. ఒకరి మృతి
- మరో ముగ్గురికి తీవ్రగాయాలు
- హైదరాబాద్ శివారులోని అంబర్ పేట్ వద్ద ప్రమాదం
- గచ్చిబౌలి నుంచి విజయవాడకి వెళ్తుండగా ఘటన
గాయాలపాలయిన వారిని పోలీసులు హయత్ నగర్ లోని ఓ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి నుంచి వారు విజయవాడకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
