ఏపీలో సింగిల్ డే రికార్డు... ఒక్కరోజులో 1322 కరోనా పాజిటివ్ కేసులు
- రాష్ట్రంలో 20 వేల మార్కు దాటిన కరోనా కేసులు
- అత్యధికంగా గుంటూరు జిల్లాలో 197 కొత్త కేసులు
- రాష్ట్రంలో మరో ఏడుగురి మృతి
గుంటూరు జిల్లాలో అత్యధికంగా 197, తూర్పుగోదావరి జిల్లాలో 171, అనంతపురం జిల్లాలో 142, కర్నూలు జిల్లాలో 136, చిత్తూరు జిల్లాలో 120, పశ్చిమ గోదావరి జిల్లాలో 106, విశాఖపట్నం జిల్లాలో 101 కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కరోనాతో ఏపీలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. దాంతో కరోనా మరణాల సంఖ్య 239కి పెరిగింది. తాజాగా 424 మంది డిశ్చార్జి కాగా, 10,860 మంది చికిత్స పొందుతున్నారు.