చిరంజీవి సినిమాలో కీలక పాత్రలో జగపతిబాబు?
- కొరటాల దర్శకత్వంలో చిరంజీవి హీరోగా 'ఆచార్య'
- చిరు తదుపరి చిత్రంగా 'లూసిఫర్' రీమేక్
- ముఖ్య పాత్రకు జగపతిని ఎంచుకున్న సుజీత్
ఈ క్రమంలో పలు చిత్రాలలో పవర్ ఫుల్ పాత్రలు పోషించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యారు. ప్రస్తుతం అటు సీనియర్ హీరోల సినిమాల నుంచి, ఇటు యంగ్ హీరోల సినిమాల వరకు చాలా వాటిలో ఆయన విలన్ తరహా పాత్రలలో నటిస్తున్నారు. ఈ కోవలో తాజాగా చిరంజీవి నటించనున్న ఓ సినిమాలో కూడా ఆయన నటించనున్నట్టు తెలుస్తోంది.
మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. 'సాహో' ఫేం సుజీత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ఓ కీలక పాత్రకు జగపతిబాబుని తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' చిత్రం పూర్తయ్యాక 'లూసిఫర్' రీమేక్ సెట్స్ కి వెళుతుంది.