వర్మ కొత్త సినిమాపై పూనం కౌర్ కామెంట్స్!
- 'పవర్ స్టార్' తన తదుపరి చిత్రం అని ప్రకటించిన వర్మ
- పీకే, ఎంఎస్, టీఎస్, ఎన్బీ క్యారెక్టర్లు కూడా ఉంటాయని ప్రకటన
- ఈ సినిమాలో వర్మ క్యారెక్టర్ ను కూడా పెట్టాలన్న పూనం కౌర్
ఈ సినిమాలో ఆర్జీవీ క్యారెక్టర్ ను కూడా పెట్టాలని సూచించింది. అమ్మాయిల బలహీనతలను తెలుసుకుని, వారిని రెచ్చగొట్టడం, మళ్లీ స్క్రీన్ షాట్లను మీడియాతో పంచుకోవడం వంటి పనులను చేసే వాడి పాత్రను కూడా పెట్టాలని పేర్కొంది. వర్మను తాను చిన్నప్పుడు ఎంతో అభిమానించేదాన్నని... కానీ ఇప్పుడు ఆయనను చూస్తుంటే బాధ కలుగుతోందని తెలిపింది.