"చచ్చిపోతున్నా డాడీ" అంటూ సెల్ఫీ వీడియో తీసిన కరోనా బాధితుడు... మూడు గంటల పోరాటంలో ఓటమి
- కరోనాతో మృతి చెందిన హైదరాబాద్ యువకుడు
- బాయ్ డాడీ అంటూ చివరి పలుకులు
- వైద్యుల నిర్లక్ష్యం లేదన్న చెస్ట్ ఆసుపత్రి సూపరింటిండెంట్
దీనిపై ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి వైద్యులు వివరణ ఇచ్చారు. వైద్యుల నిర్లక్ష్యంతో రవికుమార్ చనిపోయాడనడం సరికాదని, కరోనా వైరస్ కారణంగా గుండెపై ప్రభావం పడుతుందని చెస్ట్ ఆసుపత్రి సూపరింటిండెంట్ తెలిపారు. కరోనా వైరస్ యువకుల్లో ఎక్కువగా గుండెపై ప్రభావం చూపిస్తుందని, హార్ట్ దెబ్బతిన్న తర్వాత ఆక్సిజన్ పెట్టినా ప్రయోజనం ఉండదని వివరించారు. రవికుమార్ విషయంలోనూ అదే జరిగిందని స్పష్టం చేశారు.