తమిళ చిత్రానికి పారితోషికం తగ్గించుకున్న సమంత
- సమంత, నయనతార కలసి నటిస్తున్న చిత్రం
- సమంతకు బాగా నచ్చిన పాత్ర
- తక్కువ బడ్జెట్ కావడంతో తగ్గింపు
ఇప్పుడు సమంత కూడా అదే పనిచేస్తోంది. తన పాత్ర నచ్చడంతో తన మార్కెట్ రేటును బాగా తగ్గించుకుని సినిమా చేస్తోంది. అది తమిళ సినిమా కావడం ఓ విశేషమైతే, అందులో నయనతార కూడా నటించడం ఇంకో విశేషం కాగా, దానికి నయన్ ప్రియుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించడం మరో విశేషం. ఈ చిత్రంలోని పాత్ర సమంతకు బాగా నచ్చేసిందట. దానికి తోడు ఆ సినిమా బడ్జెట్టు కూడా తక్కువ. దాంతో నిర్మాతల రిక్వెస్ట్ పై సమంత తన ఫీజు తగ్గించుకుందని కోలీవుడ్ సమాచారం. ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలవుతుందని తెలుస్తోంది.