తొమ్మిదేళ్ల క్రితం అమ్మానాన్నలను వదిలి.. సొంత ప్రయాణాన్ని ప్రారంభించా: రకుల్ ప్రీత్ సింగ్
- దక్షిణాదిలో పూర్తి చేయాల్సిన సినిమాలు ఉన్నాయి
- ఓ హిందీ సినిమాకు కూడా సంతకం చేశాను
- ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నా
తన జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను సాధించాలనే తపనతో తొమ్మిదేళ్ల క్రితం అమ్మానాన్నలను వదిలి సొంత ప్రయాణాన్ని ప్రారంభించానని రకుల్ తెలిపింది. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ, అడ్డంకులను అధిగమించుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు అమ్మానాన్నలతో సంతోష సమయాన్ని గడుపుతున్నానని తెలిపింది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్లీ బాల్యంలోకి అడుగుపెట్టినట్టు ఉందని చెప్పింది. తాను చేసిన వంటను రుచి చూసి చాలా బాగుందని అమ్మానాన్నలు మెచ్చుకున్నారని తెలిపింది.