బాలకృష్ణ చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్!
- బాలయ్య, బోయపాటి కాంబోలో మూడో చిత్రం
- ఇటీవలే విడుదలైన మొదటి టీజర్
- తాజాగా 'మోనార్క్' అనే టైటిల్ నిర్ణయం
- చిత్రానికి తమన్ సంగీతం ఓ హైలైట్
ఇక ఈ చిత్రానికి ఎంతో ఆలోచించిన మీదట 'మోనార్క్' అనే టైటిల్ని ఫైనల్ చేసినట్టు తాజా సమాచారం. కథకు ఈ టైటిల్ బాగా సరిపోతుందని అందరూ సంతృప్తి చెందిన మీదట దీనిని ఫైనల్ చేశారని తెలుస్తోంది. త్వరలోనే దీనిని అధికారికంగా ప్రకటిస్తారు. ఇదిలావుంచితే, ఇటీవల బాలయ్య జన్మదినం సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి తమన్ సంగీతం ఓ హైలైట్ అవుతుందనే చెప్పచ్చు!