రానా, మిహికల వివాహ వేదికను ఫిక్స్ చేసిన దగ్గుబాటి ఫ్యామిలీ!
- తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ వేదికగా పెళ్లి
- ఆగస్టు 8న పరిమిత సంఖ్యలో బంధుమిత్రుల మధ్య వివాహం
- ఇంకా వెలువడని అధికారిక ప్రకటన
పెళ్లి సెట్ రాయల్ థీమ్ ను ప్రతిబింబించేలా ఉంటుందని, ఈ మొత్తం అరేంజ్ మెంట్స్ ను మిహిక స్వయంగా పర్యవేక్షించనున్నారని సమాచారం. ఇక, కరోనా వ్యాప్తి కారణంగా ఈ పెళ్లికి అతికొద్ది మంది మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలోనే అతిథుల మధ్య రానా, మిహికల పెళ్లిని వైభవంగా జరిపించాలని సురేశ్ బాబు, వెంకటేశ్ లు భావిస్తున్నారట. పెళ్లి వేదిక విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.