విజయ్ దేవరకొండ 'ఫైటర్'పై క్లారిటీ ఇచ్చిన చార్మీ
- స్క్రిప్టు మార్చుతున్నట్టు సందేహాలు
- స్క్రిప్టుపై పూర్తి నమ్మకం ఉందన్న చార్మీ
- త్వరలోనే ఒరిజినల్ టైటిల్ ప్రకటిస్తామని వెల్లడి
ఫైటర్ స్క్రిప్టుకు తిరుగులేదని, అందులో మార్పులు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత షూటింగ్ మొదలవుతుందని వెల్లడించారు. ఫైటర్ స్క్రిప్టుపై పూర్తి నమ్మకం ఉందని, ఈ సినిమా అసలు టైటిల్ కూడా త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్. ఈ చిత్ర నిర్మాణంలో బాలీవుడ్ ఫిలింమేకర్ కరణ్ జొహార్ కూడా భాగస్వామి. ఇప్పటికే ముంబయిలో కొంతభాగం చిత్రీకరణ జరిగింది. అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.