సూపర్ స్టార్ తో మరోసారి కార్తీక్ సుబ్బరాజు!
- గతేడాది రజనీతో 'పేట' చిత్రాన్ని చేసిన కార్తీక్
- తాజాగా చెప్పిన కథకు రజనీ గ్రీన్ సిగ్నల్
- ప్రస్తుతం చేస్తున్న 'అన్నాత్తే' తర్వాత సెట్స్ కు
అలాంటిది ఆయనతో రెండో సినిమా చేసే అవకాశం రావడం ఎంతో అదృష్టమనే చెప్పాలి. అటువంటి అదృష్టం, అవకాశం ఇప్పుడు తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుకు వచ్చాయి. గతేడాది రజనీతో ఆయన చేసిన 'పేట' సినిమా తమిళ నాటే కాకుండా, తెలుగునాట కూడా మంచి హిట్టయింది. ఈ క్రమంలో తాజాగా కార్తీక్ మరో కథను రజనీకి వినిపించాడట. ఇది కూడా కొత్త తరహాగా ఉండడంతో రజనీ వెంటనే ఓకే చెప్పేశాడని అంటున్నారు. ప్రస్తుతం తాను శివ దర్శకత్వంలో చేస్తున్న 'అన్నాత్తే' చిత్రం తర్వాత కార్తీక్ సుబ్బరాజు చిత్రాన్ని ఆయన చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.