మనం ఎవరూ పర్ఫెక్ట్ కాదు.. ఇప్పటికైనా మారుదాం: అనుష్క
- ప్రతి ఒక్కరికీ బాధలు ఉంటాయి
- ఇకనైనా జాలి, దయతో జీవిద్దాం
- ఉత్తమంగా జీవించేందుకు ప్రయత్నిద్దాం
అందరం ఇకనైనా జాలి, దయతో జీవిద్దామని అనుష్క తెలిపింది. నిస్సహాయుల మాటలు విందామని, వారిని ప్రేమిద్దామని చెప్పింది. అందరం కలిసి ఉత్తమంగా జీవించేందుకు ప్రయత్నిద్దామని పిలుపునిచ్చింది. ఒక చిన్న ప్రయత్నం మనలో ఎంతో మార్పును తీసుకొస్తుందని చెప్పింది. ఎలాంటి మార్పు అయినా నెమ్మదిగానే మొదలవుతుందని తెలిపింది.