Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యను నమ్మలేకపోతున్న బాలీవుడ్!

Bollywood mourns for Sushant Singh Rajput

  • బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం
  • ఇది నిజం కాకూడదని కోరుకుంటున్న బాలీవుడ్ ప్రముఖులు
  • గుండె బద్దలైందన్న సోనూ సూద్, నోట మాట రాలేదన్న అక్షయ్

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్త బాలీవుడ్ ను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఎంతో భవిష్యత్ ఉందని భావిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే మాటలు రాలేదని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. సుశాంత్ నటించిన 'చిచ్చోరే' సినిమా చూసి ఎంతో ఆస్వాదించానని, అపారమైన టాలెంట్ ఉన్న నటుడు అని కీర్తించారు. దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందిస్తూ, తాను విన్నది నిజం కాదు అంటూ వ్యాఖ్యానించారు. ఈ పరిణామం షాక్ కలిగిస్తోందని అన్నారు.

సోనూ సూద్ ఈ ఘటనపై వ్యాఖ్యానిస్తూ, సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి గుండె బద్దలైందన్నారు. ఇది నిజం కాకపోతే బాగుండు అంటూ తీవ్ర విచారం వెలిబుచ్చారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. సుశాంత్ అద్భుతమైన నటుడు అని, సుశాంత్ ఇక లేడని తెలిసి తీరని వేదన కలిగిందని పేర్కొన్నారు.

Sushant Singh Rajput
Bollywood
Suicide
Akshay Kumar
Sonu Sood
  • Loading...

More Telugu News