చెంచుల ఆహారపు అలవాట్లపై ఉపాసన వ్యాఖ్యలు
- శ్రీశైలంలో పర్యటించిన ఉపాసన
- గిరిజనులకు నిత్యావసరాల పంపిణీ
- చెంచుల జీవనశైలికి ముగ్ధురాలైన మెగాకోడలు
ఈ పోస్టులో ఆమె వ్యాఖ్యానిస్తూ... ఈ బుజ్జి మేకలు కొన్నాళ్ల తర్వాత చెంచు గిరిజనులకు రుచికరమైన ఆహారంగా మారిపోతాయేమో అంటూ స్పందించారు. "ప్రజల ఆహారపు అలవాట్లను, వారి సంస్కృతిని అర్థం చేసుకోవడం, గౌరవించడం నేర్చుకుంటున్నాను. ఈ చెంచులు నిజంగా అద్భుతమైన ప్రజలు. ప్రకృతి మాత పట్ల వారి ప్రేమ నిరుపమానం.
అయితే, మన నమ్మకాలు, అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ఇది తగిన సమయం కాదు. మాంసం తినండి.. కానీ మితంగా! మనకు ఈ వనరులు ఎక్కడ్నించి వస్తున్నాయో తెలుసుకుని మసలుకుందాం. అందుకే ఎంపిక చేసుకున్న ఆహారం తీసుకుందాం... మన భూమండలానికి, మనకు అవసరమైనంత మేర, నైతికతతో కూడిన ఆహారపు అలవాట్లకు సంబంధించి సందేశాన్ని వ్యాప్తి చేద్దాం" అంటూ ఉపాసన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.