చలో సెక్రటేరియట్‌కు కాంగ్రెస్ పిలుపు.. కోమటిరెడ్డి హౌస్ అరెస్ట్
- అధిక కరెంటు బిల్లులకు నిరసనగా కాంగ్రెస్ ‘చలో సెక్రటేరియట్’
- కాంగ్రెస్ నేతల ఇళ్ల వద్ద భారీగా మోహరించిన పోలీసులు
- రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందన్న కోమటిరెడ్డి
కరోనా సంక్షోభంలో ప్రజలపై కక్ష సాధింపు చర్యలు అవసరమా? అని ప్రశ్నించారు. మూడు నెలలుగా ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇంతింత కరెంటు బిల్లులు ఎలా కడతారన్నారు. ప్రజా సమస్యలపై పోరాడితే అరెస్ట్ చేయడం ఎక్కడి న్యాయమని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కాగా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వి.హనుమంతరావు నివాసాల వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు.