నేడు కూడా స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- ఢిల్లీలో నిన్న లీటరు పెట్రోల్ ధర రూ.72.46
- ఈ రోజు 54 పైసలు పెరిగి రూ.73కి చేరిన ధర
- డీజిల్ ధర నిన్న లీటరుకి రూ.70.59
- ఈ రోజు 58 పైసలు పెరిగి రూ.71.17కి చేరిన వైనం
ఇక ముంబయిలో లీటరు పెట్రోలు ధర 52 పైసలు పెరిగి, రూ.80.01కు చేరగా, లీటరు డీజిల్ ధర 55 పైసలు పెరిగి రూ.69.92కి చేరింది. కాగా, చమురు సంస్థలు నిన్న, మొన్న పెట్రోల్, డీజిల్ ధరలను 60 పైసల చొప్పున పెంచిన విషయం తెలిసిందే.