టీటీడీపై హీరో సూర్య తండ్రి సంచలన ఆరోపణలు... కేసు నమోదు!
- ధనవంతులకు మాత్రమే దర్శనాలు
- మామూలు జనాలను తోసేస్తారు
- అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న టీటీడీ
కాగా, లాక్ డౌన్ కారణంగా తిరుమలలో దర్శనాలు నిలిచిన తరువాత సోషల్ మీడియా వేదికగా కొన్ని శక్తులు దుష్ప్రచారం ప్రారంభించాయి. వీటిపై దృష్టిని సారించిన టీటీడీ అధికారులు, ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు ఆరోపణలు చేస్తూ, అసత్య ప్రచారం చేస్తున్న వారిని ఉపేక్షించబోమని హెచ్చరిస్తున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సైతం శివకుమార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సైతం ఈ తప్పుడు ప్రచారం ఎవరు చేస్తున్నారన్న విషయాన్ని కనిపెట్టి కేసులు పెట్టేందుకు నిమగ్నమైంది.