దేశీయంగా మరో యుద్ధ విమానాన్ని రూపొందించిన భారత్... ఆరేళ్లలో గగనవిహారం
- పదేళ్లలో భారత్ కు మరో యుద్ధ విమానం
- రెండు ఇంజన్ల ఫైటర్ జెట్ కు రూపకల్పన
- విమాన వాహక నౌకల నుంచి కార్యకలాపాలు
ఈ కొత్త యుద్ధ విమానాన్ని సముద్రాల్లో నిలిపి ఉంచే విమాన వాహక నౌకల పైనుంచి నిర్వహించేందుకు అనువుగా తయారుచేయనున్నారు. తేజస్ కు భిన్నంగా ఇందులో రెండు ఇంజన్లను ఏర్పాటు చేశారు. ఈ అత్యాధునిక జెట్ ఫైటర్లను ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ లపై మోహరించాలన్నది భారత రక్షణ వ్యూహకర్తల ప్రణాళిక!
ఈ సరికొత్త ఫైటర్ అందుబాటులోకి వస్తే భారత నేవీ అధీనంలోని మిగ్-29కే యుద్ధ విమానాలను దశలవారీగా తొలగించాలని నిర్ణయించారు. కొంతకాలంగా మిగ్-29కే విమానాల్లో లోపాలు తలెత్తుతుండడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.