భారతీయుల రక్తం తిరిగి వేడెక్కాలంటే ఇలా చేయాలి!: నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- భారతీయుల రక్తం శాంతి, అహింస మంత్రాలతో చల్లబడిపోయింది
- ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్ కథలని పిల్లలతో చదివించాలి
- నెక్స్ట్ జనరేషన్ అయినా పౌరుషంతో పెరుగుతారు
- వాళ్లనన్నా దేశానికి ఉపయోగ పడే వీరులుగా తయారు చేద్దాం
'భారత దేశానికి దేశాన్ని ప్రేమించే వీరులు కావాలి. డబ్బుకు ఓట్లు వేసే సాధారణ పౌరులు కాదు. దేశాన్ని పట్టి పీడిస్తున్న దేశద్రోహులు, గూండాలు, మాఫియా, ఫ్యాక్షన్, గూండా రాజకీయ నాయకులు, కుహనా ఉదారవాదులు, ఉగ్రవాదుల నించి ఈ దేశాన్ని కాపాడే వీరులు కావాలని నా కోరిక. ప్రతి నేరాన్ని పోలీస్ ,మిలిటరీ మాత్రమే డీల్ చెయ్యాలంటే కుదరని పని' అని నాగబాబు పేర్కొన్నారు.