మోదీజీ, ఆ పావురం నాదే.. ఇప్పించరూ ప్లీజ్: పాక్ యువకుడి వేడుకోలు
- పావురంపై గులాబీ రంగు మచ్చ, కాలికి తొడుగు
- గూఢచారి పావురమని అనుమానం
- అది తనదేనంటూ మీడియా ముందుకొచ్చిన హబీబుల్లా
ఆ పావురానికి, పాక్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, అది గూఢచారి పావురం కాదంటూ సరిహద్దులోని పాక్ గ్రామానికి చెందిన హబీబుల్లా అనే వ్యక్తి మీడియా ముందు మొరపెట్టుకున్నాడు. ఆ పావురం తనదేనని, పావురం రింగుపై ఉన్న నంబరు తన ఫోన్ నంబరని అతడు చెబుతున్నాడు. దయచేసి ఆ పావురాన్ని తనకు అప్పగించాలని భారత ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశాడు. కాగా, పావురంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.