సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ఇలియానాకు బాలీవుడ్ లో మరో చాన్స్
- తొలిసారిగా పోలీసాఫీసర్ పాత్రలో ఆది
- పాటలతో మొదలెట్టనున్న అఖిల్
* యంగ్ హీరో ఆది సాయికుమార్ తొలిసారిగా పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. 'బ్లాక్' పేరుతో నూతన దర్శకుడు జీబీ అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఆది పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. ఇందులో కథానాయికగా దర్శన బానిక్ నటిస్తోంది.
* అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ రూపొందిస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రం షూటింగ్ లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన సంగతి విదితమే. తిరిగి షూటింగును జూలై నుంచి ప్రారంభిస్తారు. ముందుగా హీరో హీరోయిన్లపై పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.