బాధపడకండి తమ్ముళ్లూ... మీ వంతు కూడా వస్తుందిలే: నితిన్
- ట్విట్టర్ లో ఆసక్తికర సంభాషణ
- పెళ్లెప్పుడంటూ వరుణ్ తేజ్ ను అడిగిన సాయితేజ్
- సింపుల్ గా నిష్క్రమించారంటూ రానా, నితిన్ లపై వరుణ్ వ్యాఖ్యలు
- ఆప్కా నెంబర్ బీ ఆయేగా అంటూ నితిన్ ట్వీట్
"బాధపడకండి తమ్ముళ్లూ మీ వంతు కూడా వస్తుందిలే!" అని ఊరడించాడు. "ఆప్కా నెంబర్ బీ ఆయేగా (మీ నెంబరు కూడా వస్తుంది). సాయితేజ్ డార్లింగ్, అవన్నీ కాదు కానీ, అప్పుడెప్పుడో నా బర్త్ డేకి గిఫ్ట్ ఇస్తానని చెప్పావు. లాక్ డౌన్ వల్ల ఆగిపోయానని అన్నావు. నా గిఫ్టు ఏదమ్మా! ఎప్పుడిస్తున్నావ్... అయాం వెయిటింగ్" అంటూ నితిన్ సరదాగా స్పందించాడు. మొత్తమ్మీద యువ హీరో మధ్య స్నేహ సంబంధాలకు ఈ ట్వీట్లు నిదర్శనంలా నిలుస్తున్నాయి.