'ఎఫ్ 3' విషయంలో వెంకీ తాజా నిర్ణయం!
- 'ఎఫ్ 2'కి సీక్వెల్ ప్లాన్ చేసిన అనిల్
- వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా 'ఎఫ్ 3'
- లాక్ డౌన్ వల్ల 'నారప్ప' ఆలస్యం
- ఇక వచ్చే ఏడాదే సీక్వెల్ షూటింగ్
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ వల్ల ఇప్పుడీ చిత్రం షూటింగ్ ముందుకి వెళ్లినట్టు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి షూటింగులు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ఓకే చెప్పినప్పటికీ, వెంకటేశ్ మాత్రం అప్పుడే షూటింగులో జాయిన్ కావడం లేదని తెలుస్తోంది. రెండు మూడు నెలల తర్వాతే ఆయన 'నారప్ప' షూటింగ్ లో జాయిన్ అవుతారని, అది పూర్తవడానికి కొంత సమయం పడుతుందని అంటున్నారు. దీంతో 'ఎఫ్ 3' చిత్రాన్ని వచ్చే ఏడాది చేయడానికి వెంకీ నిర్ణయించుకున్నారట. మరి, ఈ గ్యాప్ సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి మరో చిత్రం ఏదైనా ప్లాన్ చేస్తాడేమో చూడాలి!