'నిశ్శబ్దం' రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన కోన వెంకట్
- అనుష్క లీడ్ రోల్ లో 'నిశ్శబ్దం'
- లాక్ డౌన్ నేపథ్యంలో విడుదలపై ఊహాగానాలు
- థియేటర్లలో రిలీజ్ చేయడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని కోన వెల్లడి
దీనిపై 'నిశ్శబ్దం' చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన కోన వెంకట్ తాజాగా స్పష్టత నిచ్చారు. తమ చిత్రం విడుదలపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయని, థియేటర్లలో రిలీజ్ చేయడమే తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. అయితే పరిస్థితులు సుదీర్ఘకాలం పాటు అనుకూలించకపోయినప్పుడే 'ఓటీటీ'ని ప్రత్యామ్నాయంగా భావిస్తామని, కానీ అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నట్టు కోన వెంకట్ ట్వీట్ చేశారు.