నెల్లూరులో కరోనాపై విజయం సాధించిన 9 నెలల చిన్నారి!
- కోటమిట్ట ప్రాంతంలో కరోనా పరీక్షలు
- రెండు వారాల చికిత్స అనంతరం కోలుకున్న చిన్నారి
- పూర్తి ఆరోగ్యంగా తల్లి చెంతకు
దీంతో వెంటనే ఆ చిన్నారిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందించారు. రెండు వారాల తర్వాత ఆమెకు మరోమారు పరీక్షలు నిర్వహించగా కరోనా నెగటివ్ అని తేలడంతో నిన్న డిశ్చార్జ్ చేశారు. రెండు వారాల తర్వాత తమ చెంతకు చేరిన కుమార్తెను చూసి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా, చిన్నారికి కరోనా వైరస్ ఎవరి ద్వారా సంక్రమించిందన్న వివరాలు తెలియరాలేదు.