జీవితంలో మళ్లీ ఇలాంటి సమయం రాదేమో!: రమ్యకృష్ణ
- ఇది జీవితంలో ఓ కొత్త అనుభవం
- రెండు నెలలుగా గడప దాటలేదు
- బాగా ఎంజాయ్ చేస్తున్నా
'గత రెండు నెలలుగా గడపదాటి బయటకు వెళ్లలేదు. జీవితంలో అసలెప్పుడూ ఇలా ఇంటికి అతుక్కుపోలేదు. ఇప్పుడు కావలసినంత సమయం ఉంటోంది.. కుటుంబ సభ్యులతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నాను. జీవితంలో మళ్లీ ఇలాంటి సమయం ఇక రాదేమో..నా వరకు నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను.
అయితే, మరోపక్క బాధ ఏమిటంటే, వలస కార్మికులు, నిరుపేదలు ఈ సమయంలో చాలా కష్టాలు పడుతున్నట్టు వార్తలు వింటున్నాం.. త్వరగా వారి కష్టాలు తీరాలని కోరుకుంటున్నాను' అని చెప్పింది. కాగా, ప్రస్తుతం ఆమె కృష్ణవంశీ 'రంగమార్తాండ'లోను, పూరి-విజయ్ దేవరకొండ చిత్రంలోనూ, సాయి తేజ్ చిత్రంలోనూ నటిస్తోంది. తాను చేస్తున్న సినిమాలన్నీ తనకి సంతృప్తిని ఇచ్చేవే అని చెప్పింది.