మరింతకాలం ఇలాగే అయితే మాకు చిప్పే గతి: నటుడు బ్రహ్మాజీ
- మరోమారు లాక్ డౌన్ పొడిగించే అవకాశం
- ఇప్పటికే అవస్థలు పడుతున్న ప్రజలు
- తమ పరిస్థితి కూడా అంతే అవుతుందంటున్న బ్రహ్మాజీ
ఈ నేపథ్యంలో పేదలు, మధ్యతరగతి వాళ్లపైనే లాక్ డౌన్ ప్రభావం ఉంటుందని భావించనక్కర్లేదని, లాక్ డౌన్ ఇంకా పొడిగిస్తే తమ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందంటూ, చేతిలో చిప్ప పట్టుకుని కూర్చున్న తన పాత ఫొటోను నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "లాక్ డౌన్ ఇంకా పొడిగిస్తే మా పరిస్థితి ఇది.." అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ ఫొటో వైరల్ కావడంతో పలువురు సరదాగా స్పందిస్తూ, తాము పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతున్నారు.