ఇండస్ట్రీలో డబ్బుకు ప్రాధాన్యతనివ్వని వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో నాకు తెలుసు: బ్రహ్మానందం
- డబ్బు విషయంలో నిక్కచ్చిగానే వుంటాను
- 100 సంపాదిస్తే 10 సాయం చేస్తాను
- 23 మంది అమ్మాయిలకి పెళ్లిళ్లు జరిపించానన్న బ్రహ్మానందం
తాజాగా బ్రహ్మానందం మాట్లాడుతూ .. ఆ విషయం నిజమేనని అంగీకరించారు. "చిత్రపరిశ్రమలో ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. డబ్బుకి ప్రాధాన్యతని ఇవ్వని కొంతమంది ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో నాకు తెలుసు. నాకే కాదు .. చాలామందికి తెలుసు. అందువలన నాకు రావలసిన డబ్బు విషయంలో కాస్త గట్టిగానే వుంటాను. అలా నేను 100 రూపాయలు సంపాదిస్తే .. అందులో 10 రూపాయలు ఇతరులకి సాయాన్ని అందించడం కోసం కేటాయిస్తాను. అలా ఇంతవరకూ ఆర్థికపరమైన అండలేని 23 మంది ఆడపిల్లలకు పెళ్లిళ్లు జరిపించాను. చేసిన సాయాలను గురించి నేను చెప్పుకోను .. అందువలన నాపై విమర్శలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి" అని చెప్పుకొచ్చారు.