తెలంగాణపై కేంద్ర మంత్రి అసంతృప్తిని వ్యక్తం చేశారు: చెరుకు సుధాకర్
- కరోనా టెస్టులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు
- ఈ విషయంపై చర్చకు ఈటల సిద్ధమేనా?
- కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతున్నా.. మౌనంగా ఉంటున్నారు
ఒకవేళ ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం టెస్టులను నిర్వహిస్తున్నట్టైతే... ఆ మార్గదర్శకాలు ఏమిటో ప్రజల ముందు ఉంచాలని చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు. మార్గదర్శకాల ప్రకారమే నడుచుకుని ఉంటే... ఈ విషయంలో బహింరంగ చర్చకు ఈటల సిద్దమేనా? అని సవాల్ విసిరారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీల ఉద్యోగాలను ప్రమాదంలో పడేసిన జీవోపై సుప్రీంకోర్టులో టీఆర్ఎస్ ప్రభుత్వం వాదనలను బలంగా వినిపించలేకపోయిందని విమర్శించారు. తక్షణమే సుప్రీంలో మరో పిటిషన్ వేయాలని చెప్పారు.