ప్రసూతి వార్డులోకి అనుమతించలేదని.. డాక్టర్ చెవి కొరికిన గర్భిణి భర్త
- ఒడిశాలోని బరంపురంలో ఘటన
- అడ్డుకున్న వైద్యులపై దాడిచేసి వీరంగం
- అరెస్ట్ చేసిన పోలీసులు
గమనించిన వైద్య సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహంతో చిందులేసిన తరిణి ప్రసాద్ తనను అడ్డుకున్న వైద్యుడు స్మృతి రంజన్‌పై దాడిచేశాడు. అప్రమత్తమైన మిగతా వైద్యులు అతడిని అడ్డుకున్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన తరిణి, పీజీ వైద్య విద్యార్థి షకీల్ ఖాన్ ఎడమ చెవిని బలంగా కొరికేశాడు. మిగతా వైద్యులపైనా దాడిచేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు తరిణి ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు.