ఐదు గ్రామాలవారు మినహా మిగతా ప్రాంతాల్లో నివాసితులు ఎక్కడికీ వెళ్లక్కర్లేదు: విశాఖ సీపీ ఆర్కే మీనా
- ‘ఎల్జీ పాలిమర్స్’ వద్ద పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది
- ఈ సంస్థకు 2 కి.మీ. దూరంలో నివాసితులను ఖాళీ చేయమన్నాం
- ప్రజలు ఆందోళన చెందకుండా నిశ్చింతగా ఉండొచ్చు
ఈ ఫ్యాక్టరీకి రెండు కిలో మీటర్ల దూరంలో నివసిస్తున్న వారిని ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఖాళీ చేయాలని కోరామని చెప్పారు. ఈ సంస్థకు చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాల ప్రజలు మినహా మిగతా ప్రాంతాల్లో నివాసితులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజలందరూ ఆందోళన చెందకుండా నిశ్చింతగా ఉండవచ్చని అన్నారు.