Trivikram Srinivas: త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ సినిమాలో సునీల్?

  • త్రివిక్రమ్ తో సునీల్ కి సాన్నిహిత్యం
  • సునీల్ కి స్టార్ డమ్ తెచ్చిన త్రివిక్రమ్
  • సునీల్ పాత్రపైనే అందరిలోను ఆసక్తి
Trivikram Movie

సినిమాల్లోకి రావడానికి ముందునుంచే త్రివిక్రమ్ - సునీల్ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ఒకే రూమ్ లో అద్దెకి ఉంటూ అవకాశాల కోసం తిరిగారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఇద్దరి మధ్య ఆ స్నేహం కొనసాగుతూనే వుంది. సునీల్ కమెడియన్ గా స్టార్ స్టేటస్ ను అందుకోవడం వెనుక త్రివిక్రమ్ హస్తం వుంది. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆయన రాసిన కొన్ని పాత్రలు సునీల్ ను నిలబెట్టేశాయి. ఆ తరువాత హీరో వేషాల వైపు వెళ్లిన సునీల్ దెబ్బతినేశాడు.

మళ్లీ కమెడియన్ గా కొనసాగాలని నిర్ణయించుకుని, ఆ దిశగా గట్టి  ప్రయత్నాలే చేస్తున్నాడు. సునీల్ కి 'అరవింద సమేత' .. ' అల వైకుంఠపురములో' సినిమాల్లో త్రివిక్రమ్ అవకాశాలను ఇచ్చాడు. అయితే ఆ రెండు పాత్రలు కూడా సునీల్ స్థాయికి తగినవి కావనే విమర్శలు వచ్చాయి. అందువలన ఈ సారి త్రివిక్రమ్ సునీల్ పాత్ర విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి, ఆ పాత్రను ఒక రేంజ్ లో జనంలోకి తీసుకెళ్లేలా  డిజైన్  చేస్తున్నాడని  అంటున్నారు. త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేయనున్నాడు. ఈ సినిమాలోనే సునీల్ కి త్రివిక్రమ్ మంచి పాత్ర ఇస్తున్నాడని, ఆ పాత్రతో సునీల్ మళ్లీ బిజీ కావడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

More Telugu News