నాగ్ అశ్విన్ మూవీలో డిఫరెంట్ లుక్ తో ప్రభాస్
- షూటింగు దశలో ప్రభాస్ తాజా చిత్రం
- భారీ బడ్జెట్ తో నాగ్ అశ్విన్ చిత్రం
- తదుపరి సినిమా ప్రశాంత్ నీల్ తో?
వైజయంతీ మూవీస్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ కారణంగానే ఆయా భాషలకి చెందిన ఆర్టిస్టులను తీసుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ను నాగ్ అశ్విన్ ప్రత్యేకంగా డిజైన్ చేశాడట. ఆయన హెయిర్ స్టైల్ .. గెడ్డం .. మీసకట్టు .. కాస్ట్యూమ్స్ భిన్నంగా వుంటాయని అంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంతవరకూ ప్రభాస్ కనిపిస్తూ వచ్చిన దానికి భిన్నంగా ఈ సినిమాలో ఆయన కనిపించనున్నాడని అంటున్నారు. ఈ సినిమా తరువాత 'కేజీఎఫ్' దర్శకుడితో ప్రభాస్ సినిమా వుంటుందనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకూ నిజమవుతుందన్నది చూడాలి మరి.