నటుడు శివాజీ రాజాకు స్టెంట్ వేయనున్న వైద్యులు
- నిన్న రాత్రి గుండెపోటుతో ఆసుపత్రికి
- ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉన్న శివాజీ రాజా
- మీడియాతో మాట్లాడిన శివాజీ రాజా తనయుడు విజయ్
ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించారని తెలిపిన విజయ్ రాజా, ప్రస్తుతం ఆయన్ను అబ్జర్వేషన్‌లో ఉంచారని తెలిపారు. కాగా, శివాజీరాజాకు గుండెపోటు వచ్చి, ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఫోన్లు చేసి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకుని, తిరిగి ఇంటికి రావాలని అభిలషించారు.