దక్షిణాదిలో విజయ్ దేవరకొండ అరుదైన రికార్డు
- ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న హీరోగా గుర్తింపు
- ఇన్ స్టాగ్రామ్ లో 7 మిలియన్ల ఫాలోవర్లు
- రెండేళ్ల కిందట ఇన్ స్టాగ్రామ్ ఖాతా ప్రారంభించిన విజయ్
ఇప్పుడు విజయ్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. దక్షిణాదిన ఎక్కువమంది ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా అవతరించాడు. మరే హీరోకి లేనంతగా విజయ్ కు 70 లక్షలకు పైగా ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇంతజేసీ విజయ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ప్రారంభించింది రెండేళ్ల కిందటే. అయినప్పటికీ ఇతర హీరోలకు సాధ్యం కాని రీతిలో అత్యధిక ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. కాగా, సోషల్ మీడియా అకౌంట్లను నిర్వహించేందుకు విజయ్ దేవరకొండకు ప్రత్యేక బృందం ఉంది.