తల్లి పాత్రలు పోషిస్తారా? అనే ప్రశ్నకు నటి రేణూదేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- మహేశ్, ప్రభాస్ లకు తల్లి పాత్రల్లో నటించేందుకు సిద్ధం
- అయితే, నాకు ఇచ్చే పాత్ర బాగుండాలి
- వృద్ధురాలి పాత్రలు పోషించేందుకు సిద్దమే
మంచి అవకాశాలు వస్తే, హీరో చిన్నతనంలో లేదా ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో తల్లి పాత్ర పోషిస్తానని చెప్పారు. అవసరమైతే, మేకప్ వేసుకుని వృద్ధురాలి పాత్రలు వేసేందుకు తనకు అభ్యంతరం లేదని అన్నారు. కాగా, రైతు నేపథ్యంలో ఓ చిత్రం తీయబోతున్న రేణూదేశాయ్ ఈ ప్రాజెక్టు నిమిత్తం ఇటీవల ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడి ప్రజలను, చిన్నారులను కలిశారు. ఇందుకు సంబంధించిన వీడియోను రేణూ దేశాయ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సినిమా తన మనసుకు ఎంతో దగ్గరైందని పేర్కొన్నారు.