పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నందిత శ్వేత
- నందిత శ్వేత ప్రధాన పాత్రధారిగా 'ఐపీసీ 376'
- దర్శకుడిగా రామ్ కుమార్ సుబ్బరాయన్
- తెలుగు .. తమిళ భాషల్లో విడుదల
ఈ రోజున నందిత శ్వేత పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సినిమా యూనిట్ ఆమె పోస్టర్ ను విడుదల చేసింది. నేరస్థుల ఆటకట్టించడానికి సిద్ధమైన పోలీస్ ఆఫీసర్ గా గన్ పట్టుకుని ఆమె ఈ పోస్టర్లో కనిపిస్తోంది. ప్రభాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రామ్ కుమార్ సుబ్బరాయన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.