తన గురించి వెబ్‌సైట్లలో వస్తోన్న వార్తలపై హీరోయిన్ రాశి ఖన్నా స్పందన
- 'వరల్డ్ ఫేమస్ లవర్'లో రొమాంటిక్ సీన్లు
- మరోసారి అటువంటి సీన్లలో నటించబోనని రాశి ఖన్నా చెప్పినట్లు వార్తలు
- కొట్టిపారేసిన హీరోయిన్
- బాధపడుతూ ఏ సినిమాలోనూ నటించలేదని వ్యాఖ్య
వీటిపై ఆమె స్పందిస్తూ అసలు తాను అటువంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పింది. తాను నటించిన ప్రతి సినిమాను బాగా ఆస్వాదిస్తూ నటించానని, బాధపడుతూ మాత్రం ఏ సినిమాలోనూ నటించలేదని చెప్పింది. సినిమాలు విజయం సాధించినా, సాధించకపోయినా ప్రతి ఒక్క సినిమా ఓ అందమైన ప్రయాణమని ఆమె తెలిపింది. ప్రతి సినిమా కొత్త విషయాలను నేర్పుతుందని ఆమె చెప్పింది. తామంతా నటులుగా ఇంకాస్త ఎదుగుతామని తెలిపింది. తానెప్పుడూ తాను పోషించిన పాత్రలపై సానుకూలంగానే ఉంటానని తెలిపింది.