సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిన 40 మంది ఢిల్లీ డాక్టర్లు, వైద్య సిబ్బంది
- ఎయిమ్స్ లో పని చేస్తున్న మేల్ నర్సుకు కరోనా నిర్ధారణ
- అక్కడి మొత్తం సిబ్బందికి సెల్ఫ్ క్వారంటైన్
- వార్డులోని రోగులందరికీ కరోనా టెస్టులు
కరోనా బారిన పడిన మేల్ నర్స్ తనకు జ్వరంగా ఉందంటూ గత శనివారం ఫోన్ ద్వారా వైద్యులను సంప్రదించాడు. సోమవారం హాస్పిటల్ కు వచ్చి టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. సోమవారం నాడు డ్యూటీ ఉండటంతో... బుధవారం నాడు టెస్టులు చేయించుకున్నాడు. కరోనా సోకినట్టు అదే రోజు రాత్రి రిపోర్టు వచ్చింది. మరుసటి రోజు (గురువారం) ఈ విషయం అందరికీ తెలిసింది. ప్రస్తుతం అతను ఎయిమ్స్ లోనే చికిత్స పొందుతున్నాడు. అతనికి కరోనా సోకడంతో... అతను పని చేస్తున్న గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలోని మొత్తం సిబ్బందిని సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లాలని అధికారులు సూచించారు. దీంతో, వారంతా క్వారంటైన్ కు వెళ్లారు.