నా కెరీర్ ట్రాక్ లో పడింది: హీరో నవదీప్
- కెరీర్ ను తెలివిగా ప్లాన్ చేసుకుంటున్నాను
- ఆర్టిస్ట్ గా ప్రస్తుతం బిజీగానే వున్నాను
- ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదన్న నవదీప్
వెబ్ సిరీస్ లు చేస్తున్నాను .. అలాగే తెలుగులో 'మోసగాళ్లు' సినిమాలో విలన్ గా చేశాను. ఆ పాత్ర నాకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందనే నమ్మకం వుంది. మరో రెండు తెలుగు సినిమాలకు .. ఒక తమిళ సినిమాకు సైన్ చేశాను. ఇక నుంచి కెరియర్ ను తెలివిగానే ప్లాన్ చేసుకుంటాను. ఇక ఎక్కడికి వెళ్లినా అందరూ 'పెళ్లెప్పుడు' అని అడుగుతున్నారు. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు. ఆర్ధికంగా నిలదొక్కుకున్న తరువాతనే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.