కొరటాల శివ విసిరిన ఛాలెంజ్ పై విజయ్ దేవరకొండ స్పందన
- మా మమ్మీ పని చేయనివ్వట్లేదు
- మమ్మల్ని ఇంకా రియల్ మేన్ గా చూడట్లేదు
- ఇంకా పిల్లల మాదిరే చూస్తున్నారు
మరోవైపు కొరటాల శివ తన టాస్క్ ను పూర్తి చేసిన తర్వాత హీరో విజయ్ దేవరకొండను నామినేట్ చేశారు. ఈ ఛాలెంజ్ పై విజయ్ ట్విట్టర్ ద్వారా సరదా వ్యాఖ్యలు చేశారు. 'శివ సార్... మా మమ్మీ నన్ను పని చేయనివ్వట్లేదు. పని డబుల్ అవుతుందట. ఇంట్లో ఇంకా మమ్మల్ని రియల్ మేన్ గా చూడట్లేదు. పిల్లల్లాగానే ట్రీట్ చేస్తున్నారు. కానీ ఈ లాక్ డౌన్ లో నేనేం చేస్తున్నానో చూపిస్తాను' అని సమాధానం ఇచ్చాడు.