'ఫైటర్' విషయంలో ఆలోచనలో పడిన పూరి?
- 'ధారావి' నేపథ్యంలో సాగే కథ
- అక్కడ లాక్ డౌన్ పొడిగించే అవకాశం
- ఆ తరువాత అనుమతులు కష్టమేనంటూ టాక్
ఇటీవల 'ధారావి' ప్రాంతం నుంచి కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతూ వున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో లాక్ డౌన్ ను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ తరువాత కూడా అక్కడ షూటింగ్ జరపడానికి అంత తేలికగా అనుమతులు లభించకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కథా నేపథ్యంతో ముడిపడిన ప్రాంతంలోనే షూటింగు జరుపుకునే అవకాశం లేకుండా పోవడంతో, పూరి ఆలోచనలో పడినట్టుగా చెప్పుకుంటున్నారు.