‘పుష్ప’లో రెండో హీరోయిన్ గా నివేదా థామస్!
- బన్నీ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న చిత్రం
- ఇప్పటికే ఓ హీరోయిన్‌గా రష్మిక మందన్న ఎంపిక
- కరోనాతో నిలిచిన సినిమా షూటింగ్
ఈ చిత్రంలో మరో హీరోయిన్‌కు కూడా అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం మలయాళ నటి నివేదా థామస్‌ను చిత్ర యూనిట్ సంప్రదించిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. నాని సరసన ‘జెంటిల్‌మన్’తో పాటు ఎన్టీఆర్ ‘జై లవకుశ’లో ఓ హీరోయిన్‌గా నటించిన నివేదా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఇప్పుడు బన్నీతో కూడా నటించే అవకాశం కూడా అమెకు లభించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై సినిమా యూనిట్ నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. కాగా, కరోనా లాక్‌డౌన్ వల్ల సినిమా షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే.