రజనీ హిట్ మూవీ రీమేక్ లో ధనుశ్!
- 1981లో వచ్చిన రజనీ 'నెట్రిక్కాన్'
- కథానాయికగా కీర్తి సురేశ్
- త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే ఆలోచన
1981లో రజనీ చేసిన 'నెట్రి క్కాన్' భారీ విజయాన్ని సాధించింది. రజనీ ద్విపాత్రాభినయం చేసిన ఆ సినిమాలో మేనక కథానాయికగా నటించింది. ఇప్పుడు ఆ సినిమానే ధనుశ్ రీమేక్ చేయాలనుకుంటున్నాడు. మేనక కూతురైన కీర్తి సురేశ్ ను హీరోయిన్ గా తీసుకుంటే, ప్రాజెక్టుపై క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్నాడట. లాక్ డౌన్ ముగిసేలోగా మిగతా వ్యవహారాలను చక్కబెట్టి, ఆ తరువాత సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ధనుశ్ వున్నాడని అంటున్నారు.