దేశంలో సింగిల్ డిజిట్ కరోనా కేసులున్న రాష్ట్రాలు ఇవే!
- దేశంలో ఆశ్చర్యకర పరిస్థితి
- ఆరు రాష్ట్రాల్లో 1000కి పైగా కేసులు
- మరికొన్ని రాష్ట్రాల్లో రెండంకెలు కూడా దాటని బాధితుల సంఖ్య
ఇక, ఆరు రాష్ట్రాల్లో 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో సగం కేసులు ఈ రాష్ట్రాల నుంచే ఉన్నాయి. మహారాష్ట్రలో 3,323 కేసులు, ఢిల్లీలో 1,707, మధ్యప్రదేశ్ లో 1,355, తమిళనాడులో 1,323, రాజస్థాన్ లో 1,229, గుజరాత్ లో 1,272 కేసులు నమోదయ్యాయి. ఈ ఆరు రాష్ట్రాల్లో మరణాలు కూడా భారీగానే ఉన్నాయి. కరోనాతో ఒక్క మహారాష్ట్రలోనే 201 మంది ప్రాణాలు విడిచారు. మధ్యప్రదేశ్ లో 69, ఢిల్లీలో 42, గుజరాత్ లో 48 మరణాలు సంభవించాయి.