అమలా పాల్ మాట తప్పింది కనుకనే విడాకులు: దర్శకుడు విజయ్ తండ్రి
- పెళ్లి తరువాత సినిమాలు చేయొద్దని విజయ్ చెప్పాడు
- ముందు అంగీకరించిన అమలా పాల్
- ఆమె పద్ధతి మార్చుకోలేదన్న విజయ్ తండ్రి
"విజయ్ - అమలా పాల్ ప్రేమించుకున్నారు .. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత అమలా పాల్ సినిమాలు చేయడం విజయ్ కి ఇష్టం లేదు. అతని ఇష్ట ప్రకారమే మానేస్తానని అమలా పాల్ మాట ఇచ్చింది. కానీ ఆ తరువాత వరుస సినిమాలు చేయడం మొదలుపెట్టింది. మేము చెప్పినా .. పుట్టింటివారు చెప్పినా ఆమె తన పద్ధతిని మార్చుకోలేదు. ఎవరు ఎంతగా చెబుతున్నా ఆమె పట్టించుకోకపోవడంతో, విడాకుల వరకూ వెళ్లవలసి వచ్చింది" అని ఆయన చెప్పుకొచ్చారు.