హరీశ్ శంకర్ దర్శకత్వంలో మహేశ్ బాబు
- పరశురామ్ తో మహేశ్ బాబు
- హరీశ్ శంకర్ కి గ్రీన్ సిగ్నల్
- పవన్ సినిమా తరువాత పట్టాలపైకి
ఆ తరువాత ప్రాజెక్టు విషయంలో ఇలా జరగకుండా ఉండటం కోసం, హరీశ్ శంకర్ ను లైన్లో పెట్టాడనేది తాజా సమాచారం. హరీశ్ శంకర్ వినిపించిన ఒక లైన్ కి మహేశ్ బాబు ఓకే చెప్పేశాడని అంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హరీశ్ శంకర్ మాట్లాడుతూ, త్వరలో మహేశ్ బాబుతో ఒక సినిమా చేసే అవకాశం ఉందని చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు సెట్ అయిందన్న మాట. ప్రస్తుతం పవన్ సినిమా కోసం హరీశ్ శంకర్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆ తరువాత మహేశ్ తో కలిసి సెట్స్ పైకి వెళతాడని అంటున్నారు.