వైసీపీ మూర్ఖపు ఆలోచనలు మారడం లేదు: పంచుమర్తి అనురాధ
- ఇంగ్లీష్ మీడియంను టీడీపీ ప్రవేశపెట్టింది
- ఇంగ్లీష్ విద్య వద్దని ఎవరూ చెప్పలేదు
- హైకోర్టులో అన్ని విషయాలు బయటపడ్డాయి
ఇంగ్లీషు విద్య వద్దని ఎవరూ చెప్పలేదని... మీడియంను ఎంచుకునే అవకాశాన్ని పిల్లలు, తల్లిదండ్రులకు ఇవ్వాలనే కోర్టు చెప్పిందని అనురాధ తెలిపారు. ఏపీ హైకోర్టులో అన్ని విషయాలు బయటపడ్డాయని... అయినా, ఇంగ్లీషు నేర్పొద్దని అంటారా? అని నటించడం వైసీపీ నేతలకే చెల్లిందని దుయ్యబట్టారు.